విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామ శివార్లలో జూలై 10న పేకాట ఆడుతున్న వారిపై Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 7గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి బెట్టింగులకు వినియోగించిన రూ.47,200/- ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీస్ వారు తెలియజేసారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ పనులకి పాల్పడిన చట్టం కఠినంగా శిక్షిస్తుంది అని హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని హెచ్చరించారు. అలానే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటివి తమ నోటీసు కి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.