అమరనాథ్ యాత్రలో ఇద్దరు ఏపీకి చెందిన మహిళలు మృతి చెందారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా సోమవారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని రాజమండ్రికి చెందిన గునిశెట్టి సుధ, పార్వతిగా అధికారులు గుర్తించారు. సుధ మృతదేహం శ్రీనగర్ మార్చురీకి, పార్వతి మృతదేహం ఢిల్లీ ఎయిమ్స్కి తరలించారు. అక్కడి నుంచి స్వస్థలానికి వారి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.