తాడేపల్లి: సీఎం క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణాలపై రాష్ట్ర గృహ శాఖ మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులతో సోమవారం సీఎం జగన్ శాఖాపరమైన సమీక్షా సమావేశం నిర్వహించారు.
పేదలందరికి ఇళ్ళు పధకంలో భాగంగా.. అర్హులైన పేదలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనే ప్రభుత్వం ఆకాంక్ష మేరకు.. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు కీలక సూచనలు చేశారు. పూర్తి గణాంకాలతో సహా ఇళ్ల నిర్మాణంలో పురోగతిని సీఎంకి వివరించారు.