గార్లదిన్నె: మండల కేంద్రంలో ఓ దాబాలోకి సోమవారం నలుగురు యువకులు వచ్చి వీరంగం చేశారు. చికెన్ చేయాలని అడగగా పని మనుషులు తక్కువగా ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుందని యజమాని వారికి తెలియజేశారు.
ఆ యువకులు అప్పటికే తాగి ఉండటంతో మరో కొంతమంది యువకులు కలిసి దాబాపై దాడి చేశారు. అడ్డుకున్నపోలీసులపై కూడా దాడి చేసి ఇద్దరిని గాయపరిచారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలియజేశారు.