ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో జరిగిన స్పందన కార్యక్రమంలో డి ఆర్ ఓ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు నాగార్జున, బాబ్జాన్ ఎస్ఎఫ్ఐ పుట్టపర్తి నాయకులు కుమార్, గణేష్, గంగరాజు, యశ్వంత్, విజయ్ కుమార్, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.