మద్దిపాడు: వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నిత్యావసరాల ధరలతో పాటు... అన్ని రకాల ఛార్జీలు, పన్నుల భారం పెంచి ప్రజలపై పెను భారం మోపారని మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ విమర్శించారు.
తెదేపా మండల అధ్యక్షుడు మండవ జయం బాబు ఆధ్వర్యంలో ఇనమనమెళ్లూరులో ఆదివారం నిర్వహించిన 'బాదుడే... బాదుడు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.