యూపీలోని ఝూన్సీలో దారుణం జరిగింది. గ్వాలియర్ రోడ్ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థినిపై సోమవారం దానిష్ ఖాన్ అనే యువకుడు బ్లేడుతో దాడి చేశారు. బాధితురాలి స్నేహితురాలు అక్కడే ఉండటంతో విద్యార్థినిని కాపాడింది. గత రెండేళ్లుగా దానిష్ బాధితురాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ముఖానికి 31 కుట్లు పడ్డాయని వైద్యులు చెప్పారు.