గత వారంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలలో ప్రజలు , అభిమానులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారని, ఇదే వైసీపీ పార్టీ కి రాబోయే ఎన్నికలలో కలుగబోవు ఓటమికి నిదర్శనం అని టీడీపీ వారు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఐతే దేనికి సమాధానంగా వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి స్పందిస్తూ... ప్రపంచంలో ఎక్కడైనా మీటింగ్ అయపోయాక జనం కుర్చీలపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోతారు. మీ చంద్రబాబు మీటింగ్ లో అయితే కుర్చీలు ఎత్తుకెళ్తారు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి మ్యాజిక్ చేయాలనుకుంటే ఎలా? ఆంధ్రజ్యోతిని 'అంధ' మీడియాగా మార్చేశావు కదయ్యా! అంటూ సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.