ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు వివాదాస్పదమైంది. వింతగా బస్సును మార్గమధ్యలోనే ఆపేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. కడప డిపోకు చెందిన బస్సు డ్రైవర్ సోమవారం రాత్రి 11గంటలకు సూపర్ లగ్జరీ బస్సులో కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లాడు.
35మందితో వెళుతుండగా బస్సును వేగంగా నడపటంతో ప్రయాణికులు ఆయన్ను మందలించారు. ఎం జరిగిందో ఏమో గుర్రంకొండ సమీపంలో బస్సును రోడ్డుపై వదిలేసి డ్రైవర్ ఎక్కడికో వెళ్లిపోయాడు.