యూపీలోని లక్నో కైసర్‌బాగ్ ప్రాంతంలో ఓ మహిళ తన పెంపుడు కుక్క వల్ల ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు సుశీల త్రిపాఠి (82) ఓ రిటైర్డ్ టీచర్. ఆమె కుమారుడు అమిత్ జిమ్ ట్రైనర్‌గా చేస్తుంటాడు. ఇక సుశీల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పెంపుడు కుక్క దాడి చేసింది. శరీరంపై విచక్షణా రహితంగా కొరికింది. రక్తపు మడుగులో ఉన్న తన తల్లిని అమిత్ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.