ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో సామాజిక న్యాయం కోసం సిఎం జగన్ ఏం చేశారో చెప్పాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు బుధవారం మీడియా ద్వారా ప్రశ్నించారు. సిఎం జగన్ కు ప్రచార ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని విమర్శించారు. సంక్షేమ పథకాలలో పలు నిబంధనల పేరుతో అనేక మంది లబ్ధిదారులను తొలగించారని మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి జగన్ చెప్పే మాటల్లో చిత్తశుద్ధి లేదని యనమల పేర్కొన్నారు.