ఏపీ సీఎం జగన్ బుధవారం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అమలు చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్య శ్రీలోకి మరిన్ని వైద్య సేవలు చేర్చాలని నిర్ణయించారు. అదనంగా కొత్త ప్రొసీజర్లు చేర్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.