రూ.2,798.16 కోట్లతో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2 రాష్ట్రాలు, 3 ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 116.65 కి.మీ మేర తరంగ హిల్-అంబాజీ-అబు రోడ్డు రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2026-27 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.