ఏపీ ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి నాలుగో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుంది. నేడు విశాఖలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. నేడు 2,61,516 మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున 261.52 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.