గుంటూరు, తాడికొండ: తుళ్లూరు మండలం పరిధిలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకులు గురువారం సాయంత్రం పంచాయతీ కార్యాలయంలో బాహోబాహీకి దిగారు. ఒక రోడ్డు వేసిన బిల్లు విషయమై గొడవపడ్డారని తెలిసింది. అధికార పార్టీ నాయకుడైన బండ్ల శ్రీకాంత్, అశోక్ గ్రామ వైసీ పీ అధ్యక్షుడైన సుంకర శ్రీనివాసరావుకు మధ్య వివాదం రేగింది. దీంతో శ్రీనివాసరావుకు ముక్కుపై గాయమైంది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు.