మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. కొంతకాలం క్రితం గాయాలతో జట్టుకు దూరమైన విరాట్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ విషయమై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు. కోహ్లీకి బాబర్ మద్దతు తెలిపాడు. ఆటలో తిరిగి పైకి రావడానికి కష్టపడుతున్న విరాట్ కు హృదయపూర్వక సందేశాన్ని రాశాడు. "త్వరలోనే ఇలాంటివి సమసిపోతాయి.. ధైర్యంగా ఉండు" అంటూ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa