కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. బాగల్కోటె ప్రాంతంలో కెరూర్ వద్ద ఈవ్‌టీజింగ్ వివాదంలో కత్తిపోట్లకు గురైన బాధితులను ఆయన పరామర్శించారు. రూ.2 లక్షల పరిహారాన్ని అందించారు. ఆయన కారెక్కిన కాసేపటికే ఆ డబ్బును ముస్లిం మహిళ విసిరేసింది. తమ వారిపై అకారణంగా దాడి చేసి, ముగ్గురిని పొడిచేశారని బాధిత మహిళ పేర్కొంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.