ప్రతిపక్ష నేత చంద్రబాబే కాదు..ఆయన తాతలు దిగి వచ్చినా కూడా వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని ఆపలేరని ఏపీఎండీసీ చైర్‌పర్సన్ షమీమ్ అస్లాం హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్ ప్రజల మనిషి..తప్పకుండా ప్రకృతి కూడా సహకరిస్తుందని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి షమీమ్ అస్లాం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కడుతున్నామని, వీటిని సిమెంట్, ఇసుక అవసరం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సిమెంట్, ఇసుక లేకుండానే నిర్మాణాలు చేపట్టారా అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం మీద నిత్యం తప్పుడు ప్రచారం చేసే పట్టాభి, మరికొంతమంది ఆ పార్టీ నాయకులకు మహిళలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నిలదేసేందుకు మహిళలు వస్తే.. దొంగలా మాల్దీవులకు పారిపోయిన బ్రోకర్ పట్టాభి, చంద్రబాబు విదిల్చే చిల్లర కోసం, సిగ్గు, శరం, లజ్జ లేకుండా ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మెప్పు కోసం ఇకనైనా బ్రోకర్ పనులు చేయడం, ఊడిగం చేయడం మానుకుంటే మంచిది.