బ్రిటన్ ప్రధాని ఎవరనే అంశం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ రేసులో ఇన్ఫోసిస్ నారాయణ అల్లుడు రిషి సునాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని కోసం కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో రిషి జైత్రయాత్ర కొనసాగించారు. మొదటి రెండు దశల్లో విజయం సాధించిన ఆయన.. మూడో దశలోనూ సత్తాచాటారు. మొత్తం 115 ఓట్లతో ముందు వరుసలో నిలిచారు. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని పదవి కోసం నాలుగో రౌండ్ ఓటింగ్ జరగనుంది.