ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ చెప చిక్కింది కానీ...జనంలో భయపుట్టిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 20, 2022, 01:36 AM

అదో పొడుగాటి చేప.. దాని పేరు ‘ఓర్ ఫిష్’. ఎక్కువగా సముద్రంలో అడుగున జీవిస్తూ ఉంటుంది. ఇటీవల చిలీలో మత్స్యకారులు 16 అడుగుల పొడవైన భారీ ‘ఓర్ ఫిష్’ను పట్టుకున్నారు. ఇదేదో బాగుందని వారు సంబరపడేలోపే.. జనంలో మాత్రం ఆందోళన మొదలైంది. ఇది కనిపిస్తే ఏదో ఆపద వస్తోందనడానికి సంకేతమని స్థానికులు చెబుతున్నారు. 2011లో జపాన్‌లో ఘోర భూకంపానికి ముందు ‘ఓర్ ఫిష్’లు తరచూ కనిపించాయని గుర్తు చేసుకుంటున్నారు. భూకంపాలు, సునామీల వంటి విపత్తులు రాబోతున్నాయన్న దానికి ఇది చిహ్నమని పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని వణికిపోతున్నారు.


ఇంతకుముందు మూడు నెలల కిందట న్యూజిలాండ్‌ లోని బీచ్ లో ఒక ఓర్‌ ఫిష్‌ ను స్థానికులు గుర్తించారు. ‘ఓర్ ఫిష్’లు అరుదైన చేపల జాతి అని.. అవి ఎక్కువగా సముద్ర అడుగుభాగాన నివసిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, బ్రీడింగ్ సమయంలో నీటి ఉపరితలానికి వస్తాయని.. ఆ క్రమంలో మత్స్యకారుల వలలకు చిక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. అవి కనిపిస్తే భూకంపాలు, సునామీలు వస్తాయన్నది కేవలం ప్రజల నమ్మకం మాత్రమేనని.. సముద్రం అడుగున భూమి పొరల్లో కదలికలు వచ్చినప్పుడు ఆ అలజడి కారణంగా అవి నీటి ఉపరితలానికి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com