చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండల పరిధిలోని లద్దిగం, పుదిపట్ల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పిఎ ముని తుకారం ఒక ప్రకటనలో తెలిపారు. లద్దిగంలో మధ్యాహ్నం 12 వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. అనంతరం పుదిపట్ల పంచాయతీలోని అమర కృష్ణాపురంలో పర్యటిస్తారని తెలిపారు.