ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ పై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. వెంటనే అతడిని పోలీసు కస్టడీ నుంచి విడుదల చేయాని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. జుబైర్ తరఫు న్యాయవాది వ్రిందా గ్రోవర్ కొన్ని కీలక వాదనలను సుప్రీం బెంచ్‌కు తెలుపగా, రూ.20వేల పూచీకత్తులో జుబైర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది.