ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోగిని కాపాడు ప్రయత్నంలో...మితిమీరిన వేగంతో అబులెన్స్..నలుగురి మరణం

national |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 12:03 AM

రోగిని కాపాడే ప్రయత్నంలో అంబులెన్స్ వేగం పెంచడంతో అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు వదిలారు. కర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లాలో బుధ‌వారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రోగిని త్వ‌రిత‌గ‌తిన ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో మితిమీరిన వేగంతో వ‌చ్చిన స‌ద‌రు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వ‌ద్ద అదుపు త‌ప్పింది. టోల్ ప్లాజాలో ప‌నిచేసే సిబ్బందిని ఢీకొట్టిన అంబులెన్స్ ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా ప‌డింది. 


ఈ ఘ‌ట‌న‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు చ‌నిపోగా... మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. అంబులెన్స్ టోల్ ప్లాజాకు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వాహ‌నాల దారిలో ప‌డిపోయిన ఓ డివైడ‌ర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి... అంబులెన్స్ వేగంగా దూసుకురావ‌డంతో బిత్త‌ర‌పోయాడు. అంబులెన్స్ నుంచి త‌ప్పించుకునేందుకు అత‌డు చేసిన య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. వేగంగా వ‌చ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత ఆ టోల్ ప్లాజా ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేల‌పై జారుకుంటూ వెళ్లి ప‌ల్టీ కొట్టింది. దీంతో డ్రైవ‌ర్ కేబిన్‌లోని వారంతా టాప్ లేచిపోవ‌డంతో ఎగిరి ప‌డ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com