ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మూత్రం పోసుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనుల మీద గిద్దలూరు పట్టణానికి వస్తున్న ప్రజలకు గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు గతంలో నిర్మించిన సులబ్ కాంప్లెక్స్‌లను ఉపయోగించుకోకుండా తాళాలు వేశారు.
దీంతో స్త్రీలు, పురుషులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యను సంబంధిత అధికారులు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.