పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6వేలు ఆర్ధిక ప్రయోజనం పొందాలంటే ప్రతి ఒక్క రైతు ఈ-కేవైసీ చేయించుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ-కేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 31వ తేదీతో గడువు ముగుస్తుందన రైతులు త్వరపడి ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. పీఎం కిసాన్ కు జిల్లాలో 1, 76, 810 మంది రైతులు అర్హత సాధించగా ఇందులో 58, 400 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారన్నారు. మిగిలిన 1, 18, 410 మంది రైతులు వెంటనే తమ సమీపంలో మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ-కేవైసీ చేయించడంలో ఏమైనా సమస్యలు ఉంటే సమీప రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.