పొన్నూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులుగా ముద్రబోయిన సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు ను నియమించడం జరిగింది. అలానే కమిటీ సభ్యులను నియమమించిన సందర్భంగా టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ... గత నలబై ఏళ్ళగా బీసీ వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ వస్తుంది. వైసీపీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వారి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు సమిష్టిగా కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించడం జరుగింది.