గుంటూరు, చేబ్రోలు: కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నన్నపనేని లక్ష్మయ్య కుటుంబంలో మనస్పర్ధలు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు గమనించి.. 108 అంబులెన్స్ సమాచారం అందించారు. అప్పటికే లక్ష్మయ్య మృతి చెందినట్లు వారు గుర్తించారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు.