యూపీలోని ఫిరోజాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రాము అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్య కామినితో బైక్ పై వెళ్తుండగా వారిని ట్రక్కు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో కామిని రోడ్డుపైనే ఆడపిల్లకు జన్మనిచ్చి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాప క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు.