గుంటూరు: మంగళగిరి: నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం చెరువు సమీపంలో రహదారి మలుపు వద్ద గురువారం ఆర్టీసీ బస్సు-కారు ఢీ కొన్నాయి. ఘటనలో కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అతి వేగంగా వచ్చిన కారు ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.