పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే భద్రాచలం ముంపునకు కారణమన్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పోలవరంపై వివాదం మొదలుపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. పోలవరంను ప్రశ్నించడమంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినట్టేనని ఆయన స్పష్టంచేశారు.