దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు లాభపడి 55,991 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 16,699 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.88 వద్ద కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.