ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానాచార్యులు ఫాదర్ అమల్ రాజ్ అన్నారు. పులివెందులలోని లయోలా డిగ్రీ కళాశాల ఆవరణలో అధ్యాపకులు బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్ రెండో సంవత్సరం విద్యార్థులకు గ్లోబల్ ఎంప్లాయిమెంట్ విత్ కరెంట్ ఐటీ ట్రెండ్స్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. హనీసిస్ ఐటీ సర్వీసెస్ తో కళాశాల యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నారు.