చెన్నైలో ఓ బాలికపై వృద్ధుడు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో బాధితురాలు గర్భం దాల్చింది. టెన్త్ చదివే బాలిక (15)పై పక్కింట్లో ఉండే వృద్ధుడు (63) పలుమార్లు లైంగిక దాడి చేశాడు. కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి శుక్రవారం ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలిక 2 నెలల గర్భిణి అని వైద్యులు చెప్పారు. ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa