ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలో డిజిటల్ విద్యా బోధన చేపట్టాలని నిర్ణయించారు. స్మార్ట్ బోధన సదుపాయాల వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని వివరించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.