భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పదవికి ఎంపికైన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. కార్యక్రమానికి తాజా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.