మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్ కేసులో ఎర్ర గంగిరెడ్డి ఏ-1గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు గతంలో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది.