ఎవరైనా దోషులుగా రుజువైతే శిక్ష తప్పదని ముఖ్యమంత్రి అన్నారు.టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీని అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను అవినీతికి మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. సోమవారం కోల్కతాలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఎవరైనా దోషులుగా రుజువైతే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.