కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈ నెల 21న ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అదే రోజు తదుపరి విచారణ కోసం ఈ నెల 26వ తేదీ మంగళవారం తిరిగి రావాలని సూచించారు. మరోవైపు ఇదే అంశంపై పార్లమెంటులో విమర్శల దాడి జరుగుతుంది.