ప్రత్తిపాడు: నియోజకవర్గంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ చికిత్స చేయించుకున్న వారికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత లబ్ధిదారులకుసోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 18 మందికి సుమారు 69 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామని మాజీ మంత్రి సుచరిత వివరించారు.