తాను అవినీతికి మద్దతు ఇవ్వనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ స్పష్టం చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఆమె ఈ విధంగా స్పందించారు. 'ఎవరైనా తప్పుడు కార్యకలాపాలకు పాల్పడితే, వారికి ఎంత కఠినమైన తీర్పు వచ్చిన మాలో ఎవరూ జోక్యం చేసుకోరు. మేము వారికి మద్దతు ఇవ్వము' అంటూ మమత బెనర్జీ తేల్చి చెప్పారు.