ఆమ్రపాలి గ్రూప్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికాన్ని సంస్థ ఎగ్గొట్టిందని సుప్రీంను ఆశ్రయించాడు. మరోవైపు కంపెనీ ధోనినే తమకు రూ.42 కోట్లు చెల్లించాలని వాదిస్తోంది.