2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ప్రాజెక్టు నుంచి రష్యా వైదొలగనున్నట్లు వెల్లడించింది. చైనా మాదిరిగానే సొంతంగా ఆర్బిటింగ్ అవుట్ పోస్టును నిర్మించనున్నట్లు తాజాగా రష్యా ప్రకటించింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష కార్పొరేషన్ రోస్కోస్మోస్ కొత్త చీఫ్ యూరి బోరిసోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ రష్యా తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.