ఉగ్రవాది యాసిన్ మాలిక్ హాస్పిటల్లో చేరాడు. ఢిల్లీ తీహార్ జైలులో అతను నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. తన కేసును సరైన రీతిలో విచారించడం లేదని యాసిన్ మాలిక్ నిరాహార దీక్షలో ఉన్నారు. కొన్ని రోజుల నుంచి ఆయనకు ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పిటల్లో అతన్ని చేర్పించినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు.