వల్లూరు మండలంలో మట్టి మఫియా వెలుగుచూసింది. అధికార పార్టీకి చెందిన వారిలోనే రెండు వర్గాలుగా మట్టి మాఫియా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానిక సమాచారం మేరకు మంగళవారం రాత్రి చెరువులో అక్రమంగా మట్టిని హిటాచి యంత్రం సాయంతో తోలుతుండగా ఆ టిప్పర్లను పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అదుపులోకి తీసుకున్నారు.
మా టిప్పర్లనే పట్టుకుంటారా? అంటూ పోలీసులపై మట్టి మాఫియా విరుచుకుపడింది. 6 టిప్పర్లను మాత్రమే అధికారులు సీజ్ చేశారు. హిటాచి వాహనాన్ని తీసుకురాకుండా అక్కడే వదిలేశారు. చాలాకాలంగా మట్టి మాఫియా చెరువులోని మట్టిని సొమ్ము చేసుకుంటుందని, ఈ టిప్పర్లను పట్టించింది మట్టి మాఫియాలో ఒక వర్గంవారేనని సమాచారం. ఒక వర్గాన్ని తోలనీయకుండా, మరొక వర్గాన్ని మాత్రమే మట్టిని తోలనిస్తున్నారన్న కారణంగా ఇలా చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa