అదునుచూసి వ్యూహం పదునుపెట్టే యోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. ఏపీలో బలపడాలని యోచిస్తున్న ఆ పార్టీ తాజాగా అమరావతి అస్త్రం తెరపైకి తేస్తోంది. ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఇప్పటికే రాజధాని రైతులు దీక్షలు కొనసాగిస్తుండగా... తాజాగా అమరావతి కోసం బీజేపీ సైతం పాదయాత్ర చేపట్టనుంది. ఈ నెల 29న తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. రాజధాని గ్రామాల మీదుగా ఈ యాత్ర 75 కిలో మీటర్ల మేర సాగనుందని బీజేపీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.