చాక్లెట్ ప్రియులకు నెస్లే సంస్థ మరోసారి షాకిచ్చింది. కిట్‌క్యాట్ చాక్లెట్ల ధరలు 6.5 శాతం పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది ఓ సారి ధరలు నెస్లే ధరలు పెంచింది. పెరిగిన ఇంధన ధరలు, ఉద్యోగుల జీతాలు, ఉత్పత్తి వ్యయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెస్లే సీఈఓ మార్క్ షిండర్ వెల్లడించారు. వారం వ్యవధిలోనే ధరలు పెంచిన కోకాకోలా, మెక్‌డొనాల్డ్స్ వంటి సంస్థల జాబితాలో నెస్లే కూడా చేరింది.