క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు పనికి మాలినవని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన ఏమన్నారంటే.. “దమ్ముంటే నన్ను ఈడీతో అరెస్ట్ చేయించాలి. చికోటి వ్యవహారాన్ని తమ పై ఆపాదించడం సరికాదు. దేశంలో ఏం జరిగినా వైసీపీకి ముడిపెడుతున్నారు. టీడీపీ నిజనిర్దారణ కమిటి ఈడీకి రిపోర్టులు ఇవ్వాలి. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించాలి.” అని టీడీపికి నాని సవాల్ విసిరారు.