ఏపీ మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబీకులు ఆయన్ను గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా ఆయన నేడు కన్నుమూశారు. కొవిడ్ తర్వాతే ఆయనకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని కుటుంబీకులు తెలుపుతున్నారు. ఆయన తాడికొండ నుంచి 1983, 1985,1999లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.