2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా, ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.