అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థుల కోసం హెలికాప్టర్, కోస్ట్‌గార్డ్ నౌకలతో గాలిస్తున్నారు.